గుడ్ మార్నింగ్ కోరుట్ల.. నూతన కార్యక్రమాన్ని ప్రారంభించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే
- ప్రజల సమస్యలను తెలుసుకొని... వాటిని పరిష్కరించే ఉద్దేశ్యంలో భాగంగా ప్రారంభించినట్లు వెల్లడి
- మల్లాపూర్ మండలంలో కార్యక్రమం ప్రారంభించన ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్
- ప్రతి రోజు ఉదయం ఓ గ్రామానికి వెళ్లి సమస్యలు తెలుసుకుంటానని వెల్లడి
ఈ సందర్భంగా కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ... ప్రతిరోజు ఉదయం ఓ గ్రామానికి వెళ్లి.. గ్రామంలోని, ప్రతి వార్డులోని సమస్యను తెలుసుకుంటానని చెప్పారు. ఇందులో భాగంగా మల్లాపూర్ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించానని తెలిపారు. చిన్న చిన్న సమస్యలు ఏవైనా తన దృష్టికి వస్తే వెంటనే పరిష్కరించే ప్రయత్నం చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంతో ప్రజలు ఆనందిస్తున్నారన్నారు. మనం ఓట్ల కోసం ఎలాగైతే ప్రజల వద్దకు వెళ్లామో.. అలాగే ప్రజా సమస్యలను తీర్చడానికి వారి వద్దకు వెళ్తే బాగుంటుందని భావించానన్నారు.