ఎగ్జిట్ పోల్స్ పై కేటీఆర్ వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి కౌంటర్
- ఎగ్జిట్ పోల్ ఫలితాలను చూసి కంగారు పడవద్దన్న కేటీఆర్
- ఎగ్జిట్ పోల్ ఫలితాలు నిజమైతే కేటీఆర్ క్షమాపణలు చెబుతాడా? అని రేవంత్ రెడ్డి ప్రశ్న
- తెలంగాణ సమాజం అవసరమనుకున్నప్పుడు వేగంగా స్పందిస్తుందని వ్యాఖ్య
కామారెడ్డిలోనూ కాంగ్రెస్ శ్రేణులు కష్టపడ్డారని, కేసీఆర్ను ఓడగొడుతున్నారన్నారు. తెలంగాణ మలి ఉద్యమంలో తొలి అమరవీరుడు శ్రీకాంతచారికి నివాళులు అర్పిస్తున్నామన్నారు. ఎగ్జిట్ పోల్స్ ను చూసి కేటీఆర్ బయటకు వచ్చి భయపెట్టే ప్రయత్నాలు చేశారన్నారు. ఈ ఎగ్జిట్ పోల్స్ నిజమైతే కేటీఆర్ క్షమాపణలు చెబుతారా? అని ప్రశ్నించారు. కేటీఆర్ వచ్చి మాట్లాడాడు అంటే దుకాణం బంద్ అయినట్లే అన్నారు. కేసీఆర్ ముఖం చాటేశాడని, కేటీఆర్ ఇక ఇక్కడ ఉండరు.. అమెరికా వెళ్లిపోతారని జోస్యం చెప్పారు. నేను ఏ పదవిలో ఉండాలనే విషయం కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందన్నారు.