ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు పిటిషన్ పై విచారణను వాయిదా వేసిన సుప్రీంకోర్టు
- పిటిషన్ ను విచారించిన జస్టిస్ బోస్, జస్టిస్ బేలా త్రివేదీల ధర్మాసనం
- తదుపరి విచారణ డిసెంబర్ 12వ తేదీకి వాయిదా
- అప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశం
మరోవైపు ఈ పిటిషన్ పై విచారణ ఈ నెల 9, గత నెల 13, 17, 20వ తేదీల్లో జరిగింది. అయితే, స్కిల్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై తీర్పు వచ్చిన తర్వాత ఈ పిటిషన్ ను పరిశీలిస్తామని ధర్మాసనం ఇంతకు ముందే తెలిపింది. క్వాష్ పిటిషన్ పై తీర్పు వెలువడకపోవడంతో విచారణను మరోసారి వాయిదా వేసింది.