తెలంగాణ పత్రికల్లో కర్ణాటక ప్రభుత్వ పథకాల ప్రకటనలు..ఈసీ కీలక ఆదేశాలు
- తెలంగాణ పత్రికల్లో కర్ణాటక ప్రభుత్వ పథకాల ప్రకటనలపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు
- స్పందించిన ఈసీ, కర్ణాటక సీఎస్‌కు నోటీసులు
- ప్రకటనలు తక్షణం నిలిపివేయాలని ఆదేశం
- ఇప్పటివరకూ ఇచ్చిన ప్రకటనలపై సీఎస్ వివరణ కోరిన వైనం
బీజేపీ నేతల ఫిర్యాదుపై స్పందించిన ఈసీ ముఖ్యకార్యదర్శి.. తెలంగాణ వార్తా పత్రికల్లో ప్రకటనలను తక్షణం నిలిపివేయాలని ఆదేశించారు. ఎన్నికల నియమావళి ఎందుకు ఉల్లంఘించారో మంగళవారం సాయంత్రం 5 గంటల లోపు సంజాయిషీ ఇవ్వాలని కర్ణాటక సీఎస్‌కు నోటీసులు పంపారు. ఈసీ నిబంధనల ప్రకారం, ఎన్నికలు జరగని రాష్ట్రాల ప్రభుత్వాలు, కేంద్రం తమ సంక్షేమ కార్యక్రమాల గురించి ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ప్రకటనలు ఇవ్వకూడదు.