హైదరాబాద్‌లో రాత్రివేళ రాహుల్ పర్యటన..నిరుద్యోగులతో ముచ్చట్లు
- ముషీరాబాద్, అశోక్ నగర్ ప్రాంతాల్లో పర్యటించిన కాంగ్రెస్ సీనియర్ నేత
- పోటీ పరీక్షల విద్యార్థుల సాధకబాధకాలను అడిగి తెలుసుకున్న వైనం
- కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగుల సమస్యలు పరిష్కరిస్తానని భరోసా
- స్టూడెంట్లతో కలిసి చిక్కడపల్లి బావర్చీలో బిర్యాని తిన్న రాహుల్
శనివారం రాత్రి రాహుల్ నగరంలోని ముషీరాబాద్, అశోక్ నగర్ ప్రాంతాల్లో అకస్మాత్తుగా పర్యటించారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులతో చిట్‌చాట్ నిర్వహించారు. వారి సాధకబాధకాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పేపర్ లీక్ ఉదంతం, నోటిఫికేషన్ల నిలిపివేత వంటి అంశాలు చర్చకు వచ్చాయి. కాగా, ఉద్యోగార్థులపై సీఎం కేసీఆర్ తీరును రాహుల్ ఖండించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలు తీరుస్తానని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో కొందరు పోటీ పరీక్షల అభ్యర్థులతో కలిసి చిక్కడపల్లిలోని బావర్చీ హోటల్‌లో బిర్యానీ తిన్నారు. అభిమానులతో కలిసి సెల్ఫీలు దిగారు.