Lokesh: ఆ డ్రెస్ రెడీ చేసుకో.. జగన్ కు లోకేశ్ సూచన

Nara Lokesh warning to AP Cm jagan
షార్ట్స్‌లో చూడండి
వ్యవస్థలను మేనేజ్ చేస్తూ బయట అధికారం చెలాయిస్తున్న జగన్ త్వరలోనే జైలుకు వెళతారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు. జైలుకు వెళ్లే సమయం దగ్గర పడింది.. అవినీతి చక్రవర్తి జగన్ తనకు కేటాయించిన ఖైదీ నెంబర్ 6093 డ్రెస్ ఉతికించి పెట్టుకోవాలంటూ లోకేశ్ ఎగతాళి చేశారు. అక్రమాస్తుల కేసులో జగన్ కు మంజూరు చేసిన బెయిల్ ను రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎంపీ పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. జగన్ తో పాటు సీబీఐకి రెండు రోజుల క్రితం నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని గుర్తుచేస్తూ లోకేశ్ తాజాగా జగన్ పై విమర్శలు గుప్పించారు. పదేళ్లుగా వివిధ కేసులను మేనేజ్ చేస్తూ వచ్చారని, దొంగ సొమ్ముతో వ్యవస్థలను ఇంకెంత కాలం మేనేజ్ చేస్తారని ప్రశ్నించారు.
Go Back to Shorts
Lokesh
jail dress
jagan
khaidi
Supreme Court
notice to jagan

More Telugu News