కల్యాణ్ రామ్ 'డెవిల్' నుంచి 'లేడీ రోజీ' సాంగ్ వచ్చేస్తోంది... ప్రోమో ఇదిగో!
- కల్యాణ్ రామ్ హీరోగా డెవిల్
- బ్రిటీష్ పాలన నాటి గూఢచారిగా కనిపించనున్న కల్యాణ్ రామ్
- అభిషేక్ నామా దర్శకత్వంలో చిత్రం
- నేడు పాటకు సంబంధించిన అప్ డేట్ ను పంచుకున్న చిత్రబృందం
తాజాగా ఈ సాంగ్ ప్రోమోను చిత్ర బృందం నేడు విడుదల చేసింది. సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన బాణీలకు శ్రీహర్ష ఈమని సాహిత్యం సమకూర్చారు. హుషారుగా సాగే ఈ గీతాన్ని ప్రముఖ ర్యాప్ సింగర్ రాజకుమారి ఆలపించారు. కాగా, 'లేడీ రోజీ' పూర్తి పాటను నవంబరు 27న విడుదల చేయనున్నారు.