Advertisement

అలాంటి ప్రజెంటేషన్లు ఇచ్చుకోవడానికి సిగ్గుండాలి: కేటీఆర్‌పై వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు

YS Sharmila hot comments on ktr
  • ఒక్కో నెత్తిమీద లక్షల అప్పులు పెట్టి ఆదాయం పెరిగిందని చెప్పడం సిగ్గుచేటు అన్న షర్మిల
  • పదేళ్లుగా అవినీతి, దోపిడీ, దౌర్జన్యాలతో కూడిన నియంత పాలన సాగిందని విమర్శ
  • ఆఫ్ఘనిస్తాన్‌ను తలపించిన తాలిబన్ల పాలన అని ఆగ్రహం
  • నిరుద్యోగులను ఉద్దరించినట్లు సవాళ్లు విసురుతుంటే నవ్వాలో.. ఏడవాలో అర్థం కావడం లేదని ఎద్దేవా
తెలంగాణలో పదేళ్లుగా అవినీతి, దోపిడీ, దౌర్జన్యాలతో కూడిన నియంత పాలన సాగిందని... అంతేకానీ కేటీఆర్ చెప్పినట్లు సమగ్ర, సమీకృత, సమ్మిళిత, సమతుల్య అభివృద్ధి కాదని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు.  ఆమె ట్విట్టర్ వేదికగా శుక్రవారం ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఆఫ్ఘనిస్తాన్‌ను తలపించిన తాలిబన్ల పాలన ఇది అని దుయ్యబట్టారు. ఈ పదేళ్ల కాలంలో ఐదు లక్షల కోట్లు అప్పులు చేసి, ఒక్కో నెత్తిమీద రెండు లక్షల రూపాయల అప్పు మోపి తెలంగాణ తలసరి ఆదాయం పెరిగిందని ప్రజెంటేషన్లు ఇచ్చుకోవడానికి సిగ్గు ఉండాలని తీవ్ర విమర్శలు చేశారు. 

దేశంలో ఉద్యోగాల కల్పనలో రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉంటే.. నిరుద్యోగులు 50 లక్షల మంది ఎందుకు ఉన్నారు? ఉద్యోగాలిస్తే వందలాది మంది ఆత్మహత్యలు ఎందుకు చేసుకున్నారు? పదేళ్లలో పట్టుమని 65 వేల ఉద్యోగాలు ఇవ్వడం చేతకాని మీరు.. ఇంటికో ఉద్యోగం ఇచ్చినట్లు, నిరుద్యోగుల్ని ఉద్ధరించినట్లు బహిరంగ చర్చకు సవాళ్లు విసురుతుంటే నవ్వాలో.. ఏడవాలో అర్థం కావడంలేదని ఎద్దేవా చేశారు. మీ దరిద్రపు పాలనలో టీఎస్పీఎస్సీ లీకుల బాగోతం దేశమంతా తెలిసిందే అన్నారు. ఇంకా నిరుద్యోగులు మిమ్మల్ని నమ్ముతారని కల్లబొల్లి కబుర్లు చెప్పడం మీ అవివేకానికి నిదర్శనం అన్నారు.
Advertisement
YS Sharmila
Telangana Assembly Election
KTR
BRS

More Telugu News