'సైంధవ్' నుంచి ఫస్టు సింగిల్ రిలీజ్ .. ఈవెంటులో సందడి చేసిన వెంకీ!

Saindhav Movie Song Launch Event
షార్ట్స్‌లో చూడండి
వెంకటేశ్ హీరోగా శైలేశ్ కొలను 'సైంధవ్' సినిమాను రూపొందించాడు. వెంకట్ బోయినపల్లి నిర్మించిన ఈ సినిమాను, సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ ను రిలీజ్ చేశారు. సాంగ్ లాంచ్ ఈవెంటులో వెంకటేశ్ కాలేజ్ స్టూడెంట్స్ మధ్య సందడి చేశారు. "35 ఏళ్ల నుంచి నా కెరియర్ ను అలా నడుపుకుంటూ వస్తున్నాను. ఇది నా 75వ సినిమా .. నేను ఫస్టు మూవీ చేసినప్పుడు మీరు పుట్టి ఉండరు. 'సీతమ్మవాకిట్లో' చూసి ఉంటారు మహేశ్ బాబు ఉన్నాడు గనుక, 'గోపాల గోపాల' చూసుంటారు .. పవన్ కల్యాణ్ ఉన్నాడు గనుక" అంటూ హూషారెత్తించారు. తాను చదువుకునేటప్పుడు బ్యాక్ బెంచర్ ననీ, అందువలన కొంచెం హెల్ప్ చేయాలంటూ నవ్వించారు.  

 'సైంధవ్' విషయానికి వచ్చేసరికి ఇది చాలా స్పెషల్ సినిమా .. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్. 'రాంగ్ యూసేజ్' అనే సాంగ్ విషయానికి వస్తే, సెల్ ఫోన్స్ వాడకం గురించి లెక్చర్ లా కాకుండా చాలా మీనింగ్ ఫుల్ గా ఉంటుంది. మీరంతా తప్పకుండా ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నాను" అని అన్నారు.

Go Back to Shorts
Saindhav
Venkatesh
Sailesh Kolanu

More Telugu News