ఇండిగో విమానంలో మద్యం మత్తులో మహిళా సిబ్బందితో అనుచిత ప్రవర్తన.. ప్రయాణికుడి అరెస్ట్
- విమానాల్లో శ్రుతిమించుతున్న ప్రయాణికుల ఆగడాలు
- అనుచిత ప్రవర్తనలతో పతాక శీర్షికల్లోకి
- తాజాగా జైపూర్-బెంగళూరు విమానంలో ప్రయాణికుడి అసభ్య ప్రవర్తన
- విమానాల్లో మద్యం పంపిణీపై వ్యక్తమవుతున్న ఆందోళనలు
ఇటీవల కొన్ని నెలల క్రితం ఓ ప్రయాణికుడు తాగిన మత్తులో సహ ప్రయాణికురాలిపై మూత్రవిసర్జన చేసిన ఘటన అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా సంచలనమైంది. ఎయిర్ ఇండియా విమానంలో జరిగిన ఈ ఘటనను మర్చిపోకముందే అలాంటిదే మరోటి జరిగింది. గువాహటి-ఢిల్లీ విమానంలో ఓ ప్రయాణికుడు తాగిన మత్తులో వీరంగమేశాడు. క్యాబిన్‌లో వాంతులు చేసుకోవడంతోపాటు మలవిసర్జన కూడా చేశాడు. ఈ వరుస ఘటనలతో విమానాల్లో మద్యం సరఫరాపై ఆందోళన వ్యక్తమవుతోంది.