Jyothi Kumar Yadav: టీమిండియా ఓటమితో గుండెపోటుకు గురై మరణించిన ఆంధ్రా టెక్కీ

AP techie collapsed to die after Team India lose in world cup
షార్ట్స్‌లో చూడండి
వరల్డ్ కప్ లో వరుస విజయాలతో అభిమానుల్లో ఆశలు రేకెత్తించిన టీమిండియా... ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓడిపోవడం అభిమానులకు మింగుడుపడడంలేదు. టీమిండియాదే కప్ అని గట్టిగా నమ్మిన అభిమానులు మ్యాచ్ ఫలితంతో హతాశులయ్యారు. 

ఏపీకి చెందిన ఓ టెక్కీ టీమిండియా ఓటమిని తట్టుకోలేక గుండెపోటుకు గురై మరణించాడు. తిరుపతి జిల్లా దుర్గసముద్రం గ్రామానికి చెందిన జ్యోతికుమార్ యాదవ్ (32) ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్. నిన్న వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూస్తూ ప్రాణాలు విడిచాడు. 

మ్యాచ్ ముగిశాక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కన్నీటితో మైదానాన్ని వీడడం టీవీలో చూసిన జ్యోతికుమార్ తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యాడు. ఆ తర్వాత కుప్పకూలిపోయాడని కుటుంబ సభ్యులు వెల్లడించారు. అతడిని వెంటనే తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించామని, అప్పటికే అతడు మరణించినట్టు డాక్టర్లు నిర్ధారించారని తెలిపారు. 

జ్యోతికుమార్ తండ్రి టీటీడీ విశ్రాంత ఉద్యోగి. త్వరలోనే జ్యోతికుమార్ పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. అంతలోనే ఈ ఘటన జరగడంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
Go Back to Shorts
Jyothi Kumar Yadav
Death
Cardiac Arrest
Team India
Australia
World Cup Final
Tirupati
Andhra Pradesh

More Telugu News