చంద్రబాబు అరెస్ట్ పై మరోసారి స్పందించిన తలసాని శ్రీనివాస్ యాదవ్
- చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారన్న తలసాని
- రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యలు సరికాదని వ్యాఖ్య
- ఓట్ల కోసం తాను ఈ వ్యాఖ్యలు చేయడం లేదని తలసాని
తనకు రాజీకీయ జీవితాన్ని ఇచ్చింది ఎన్టీఆర్ అని అన్నారు. తన గుండెలో ఆయనకు శాశ్వత స్థానం ఉంటుందని చెప్పారు. అమీర్ పేటలో కానీ, సనత్ నగర్ లో కానీ ఎక్కడ కోరుకుంటే అక్కడ ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు తాను సిద్ధమని అన్నారు. సనత్ నగర్ లో కమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వనమహోత్సవంలో తలసాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.