ఓటేస్తూ సెల్ఫీ దిగితే నేరుగా జైలుకే..!
- పోలింగ్ బూత్ లోకి సెల్ ఫోన్ తీసుకెళ్లడం నిషేధం
- సిబ్బంది కళ్లుగప్పి తీసుకెళ్లినా సెల్ఫీ దిగే ప్రయత్నం చేయొద్దు
- ఓటేశాక సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారంటే చిక్కుల్లో పడ్డట్లే..!
ఓటేస్తూ సెల్ఫీ దిగినా.. దానిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసినా మీ ఓటును పరిగణనలోకి తీసుకోరు. నిబంధనలు అతిక్రమించినందుకు పోలీస్ కేసు నమోదు చేస్తారు. ఆపై జైలుకెళ్లడం, కోర్టుల చుట్టూ తిరగడం తప్పదు. మరోవైపు, కళ్లు కనిపించని వారు ఓటేసేందుకు సహాయకుడిని అనుమతిస్తామని ఎన్నికల సిబ్బంది చెబుతున్నారు. అయితే, అప్పటికే ఓటు హక్కును వినియోగించుకున్న వ్యక్తినే సహాయకుడిగా అంగీకరిస్తామని, సదరు అంధుడు ఎవరికి ఓటేశాడనే విషయాన్ని బహిరంగ పరచబోనని సహాయకుడిగా వెళ్లే వ్యక్తి ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు.