నా భర్తను ఆమె చాలా తక్కువ చేసి చూసింది: బిగ్ బాస్ భోలే షావలి భార్య సీమ
- బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చేసిన భోలే
- ఆయన ఆట తీరుపై స్పందించిన భార్య సీమ
- ఆయన విషయంలో శోభ తీరు పట్ల అసహనం
- ఆమె మాట తీరు బాధించిందని వెల్లడి
"నామినేషన్స్ సమయంలో భోలే బట్టలను గురించి శోభ అదోలా మాట్లాడింది. నీ బట్టలు చూస్తేనే నీ గురించి అర్థమవుతుందని అంది. ఇక ప్రియాంక అయితే 'థూ' అని కూడా అనేసింది. ఆ రోజు వాళ్ల మాటలను విన్న తరువాత మేమంతా చాలా బాధపడ్డాము. అన్ని మాటలు అన్నప్పటికీ ఆ రాత్రి ఆయన వెళ్లి వాళ్లకు సారీ చెప్పాడు" అని అన్నారు.
"సారీ అమ్మా .. క్షమించమ్మా అని భోలే వాళ్లను అడిగాడు. అయినా శోభా తీసుకోలేదు. 'నీ సారీ ఎవరికి కావాలి? నువ్వెవరికి కావాలి? నిన్ను చూస్తుంటేనే నాకు చిరాకేస్తుంది' అని అంది. ఏదో ఒక కారణం చెబుతూ ఆయనపై నామినేషన్స్ వేస్తూ వచ్చింది. ఆయనను చాలా తక్కువ చేసి చూసింది" అని చెప్పారు.