రెడ్డి.. రావు, ఎవరైనాసరే మా ముందు వంగాల్సిందే: రేవంత్ రెడ్డికి అక్బరుద్దీన్ తీవ్ర హెచ్చరిక
- మా తమ్ముడికి రాజకీయాల గురించి తెలియదు... కుటుంబం జోలికి రావొద్దన్న అక్బరుద్దీన్
- రేవంత్ రెడ్డి తమను రెచ్చగొట్టవద్దని హెచ్చరిక
- ఇప్పటి వరకు జరిగిన హిందూ - ముస్లిం గొడవలు తీసుకువచ్చిందే కాంగ్రెస్ అని ఆరోపణ
ఇప్పటి వరకు ప్రతిచోట హిందూ - ముస్లిం గొడవలు తీసుకువచ్చిందే కాంగ్రెస్ అని ఆరోపించారు. 55 మతపరమైన గొడవలకు కాంగ్రెస్ కారణమన్నారు. నెహ్రూ దేశ విభజన వల్లే భారత్ - పాకిస్తాన్ రెండు ముక్కలైందని, లేదంటే ఒకే దేశంగా ఉండేదన్నారు-. తన అన్న అసదుద్దీన్ పై కేసులు పెట్టారని, తనను నిజామాబాద్ జైల్లో ఉంచారని కాంగ్రెస్‌పై మండిపడ్డారు. అప్పుడు తన కుటుంబ సభ్యులను కూడా కలవనీయలేదన్నారు. తనకు ట్రీట్మెంట్ కూడా చేయలేదంటే కాంగ్రెస్సే కారణమన్నారు. రేవంత్ రెడ్డి తమను రెచ్చగొట్టవద్దన్నారు. ప్రజలు ఈ నెల 30న పతంగి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.