Brush Vesko: "హే మామా బ్రష్షే వేస్కో.. మైండంతా రిఫ్రెష్ చేస్కో..."  నితిన్ ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ నుంచి హుషారైన పాట విడుదల

New song from Nithiin Extra Ordinary Man movie out now
షార్ట్స్‌లో చూడండి
నితిన్, శ్రీలీల జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఎక్స్ ట్రా... ఆర్డినరీ మ్యాన్. తాజాగా ఈ చిత్రం నుంచి హే మామా బ్రష్షే వేస్కో... మైండంతా రిఫ్రెష్ చేస్కో అంటూ సాగే హుషారైన సాంగ్ విడుదలైంది. హ్యారిస్ జయరాజ్ తన ట్రేడ్ మార్క్ బాణీలు అందించగా, రామజోగయ్యశాస్త్రి సాహిత్యం సమకూర్చారు. ఈ పాట లిరికల్ వీడియోను చిత్ర బృందం పంచుకుంది. ఈ చిత్రంలో డాక్టర్ రాజశేఖర్, సుదేవ్ నాయర్, రావు రమేశ్, రోహిణి, బ్రహ్మాజీ, అజయ్, హర్ష వర్ధన్, అన్నపూర్ణమ్మ, పవిత్ర నరేశ్, హైపర్ ఆది, హరితేజ, పృథ్వీ తదితరులు నటించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన 'డేంజర్ పిల్లా' అనే సాంగ్ సూపర్ డూపర్ హిట్టయింది.
Go Back to Shorts
Brush Vesko
New Song
Nithiin
Extra Ordinary Man
Sree Leela
Vakkantam Vamsy

More Telugu News