బీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్... అంబాసిడర్ కారు డ్రైవర్‌గా మారిన కవిత

MLC Kavitha drives brs leader car
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కారు డ్రైవర్‌గా మారారు. తమ పార్టీ అభ్యర్థితో నామినేషన్ వేయించేందుకు వెళ్లిన ఆమె కాసేపు కారు నడిపారు. ఎమ్మెల్యే గణేశ్ గుప్తా రెండో సెట్ నామినేషన్ దాఖలు చేసేందుకు కవితతో కలిసి అంబాసిడర్ కారులో బయలుదేరారు. ఈ కారును స్వయంగా కవిత నడిపారు. తాను కారు డ్రైవింగ్ చేస్తున్న వీడియోను, ఫోటోలను కవిత సోషల్ మీడియా అనుసంధాన ఎక్స్ వేదికగా పంచుకున్నారు. 'దూసుకెళ్తున్న కారు... రాబోయేది మ‌ళ్లీ కేసీఆర్ స‌ర్కారు... హ్యాట్రిక్ సీఎం కేసీఆర్' అని ట్వీట్ చేశారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ... గణేష్ గుప్తా చేసిన అభివృద్ధి, బీఆర్ఎస్ పథకాలు చూసిన ప్రజలు మరోసారి ఆయనను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో వరుసగా మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యి రికార్డ్ సృష్టిస్తారన్నారు. ప్రజల ఆదరణ ప్రేమ వల్ల గెలుపు ఖాయమన్నారు.

నిజామాబాద్ పట్టణం ఆనాడు ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉంది? అనే ఆలోచన చేయాలన్నారు. ఇక్కడ కల్పించిన శాంతిభద్రతల వాతావరణం కారణంగా అంతర్జాతీయ కంపెనీలు నిజామాబాద్‌కు వచ్చాయన్నారు. 54 సంవత్సరాలు అవకాశమిచ్చిన కాంగ్రెస్ ఎప్పుడూ కూడా నిజామాబాద్‌కు చేసిందేమీ లేదన్నారు. ఆరుసార్లు బీజేపీకి అవకాశమిస్తే కూడా చేసిందేమీ లేదన్నారు. కాబట్టి ప్రజలు ఆలోచించి ఓటేయాలన్నారు.
Go Back to Shorts
K Kavitha
BRS
Telangana Assembly Election

More Telugu News