ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తప్పిన ప్రమాదం
- రాజస్థాన్‌లో ప్రచార వాహనాన్ని తాకిన విద్యుత్ వైర్లు
- తెగి పడిన ఒక కరెంటు తీగ.. వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేత
- బీజేపీ నేతల అప్రమత్తతతో తప్పిన ప్రమాదం
మంగళవారం రాజస్థాన్ ఎన్నికల ప్రచారం నిర్వహించిన అమిత్ షా.. భాజపా అభ్యర్థుల తరఫున విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ ఘటనపై రాజస్థాన్ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ స్పందించారు. ప్రమాదం తప్పడంపై సంతోషం వ్యక్తం చేసిన ఆయన ఈ ఘటనపై దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. కాగా రోడ్డుకు ఇరువైపులా ఇళ్లు, దుకాణాలు ఉన్న వీధిలో ర్యాలీ నిర్వహించారు. దీంతో కరెంటు వైర్లు వాహనానికి దగ్గరగా ఉన్నాయని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.