కేసీఆర్ ను ఎదుర్కోవాలంటే మరో కేసీఆర్ పుట్టాలి: కవిత
- కేసీఆర్ లాంటి గొప్ప నేతను కొట్టడం ఎవరి తరం కాదన్న కవిత
- కాంగ్రెస్ హయాంలో నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని విమర్శ
- ఉద్యోగాల గురించి మాట్లాడే అర్హత రేవంత్ కు లేదని వ్యాఖ్య
కేసీఆర్ పాలనలో 2 లక్షల 32 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరిగిందని కవిత అన్నారు. వీటిలో లక్ష 60 వేల ఉద్యోగాల భర్తీ ఇప్పటికే జరిగిందని... మిగిలిన ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వివిధ దశల్లో ఉందని చెప్పారు. ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులను రేవంత్ రెడ్డి అడ్డా కూలీలతో పోల్చారని విమర్శించారు. రేవంత్ రెడ్డికి ఉద్యోగాల గురించి మాట్లాడే అర్హత లేదని చెప్పారు.