సిరిసిల్లలో కేటీఆర్ లోకల్ అయితే కోరుట్లలో నేనూ లోకలే: ధర్మపురి అర్వింద్
- కోరుట్ల నుంచి పోటీ చేయడం తన అదృష్టమన్న అర్వింద్
- కోరుట్ల రాజకీయాల్లో పెను మార్పులు తీసుకువస్తుందన్న ఎంపీ
- డబ్బులు పంచకుండానే కోరుట్లలో అద్భుత విజయం సాధిస్తామని ధీమా
- కేసీఆర్ అబద్దాన్ని చాలా అందంగా చెబుతారని విమర్శలు
కోరుట్లలో బీజేపీ గెలవడం ద్వారా సరికొత్త రాజకీయాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. డబ్బులు ఏమీ పంచకుండానే కోరుట్లలో బీజేపీ అద్భుత విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ అబద్ధాన్ని చాలా అందంగా చెబుతారన్నారు. ఈవీఎంలలో రోడ్డు రోలర్, కారు గుర్తులను గుర్తించేందుకే కేసీఆర్ కంటి వెలుగును తీసుకు వచ్చారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం పక్కా అన్నారు.