dr k laxman: ఇష్టం వచ్చినట్లు మాట్లాడవద్దు: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాపై తీవ్రంగా స్పందించిన లక్ష్మణ్

Laxman serious comments on Komatireddy Rajagopal resignation
షార్ట్స్‌లో చూడండి
మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేయడంపై ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ తీవ్రంగా స్పందించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... పార్టీని బలోపేతం చేసేందుకు కార్యకర్తలు ఓ వైపు రక్తం చిందిస్తుంటే ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదని మండిపడ్డారు. జాతీయ నాయకత్వం సమక్షంలో ఆయన తమ పార్టీలో చేరారని, ఇప్పుడు నిందలు వేయడం సరికాదన్నారు. రాజగోపాల్ రెడ్డికి జాతీయస్థాయిలో పార్టీ మంచి స్థానం కల్పించిందన్నారు.

నరేంద్ర మోదీ కచ్చితంగా మూడోసారి ప్రధాని అవుతారన్నారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఏం చేసిందో తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారన్నారు. బీజేపీ అందరిలోనూ జాతీయ భావాన్ని పెంపొందిస్తుందన్నారు. జనసేన, బీజేపీ కలిసి తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఆయన చెప్పారు.

కొందరు అలా వచ్చి వెళ్తుంటారు: జితేందర్ రెడ్డి

రాజగోపాల్ రెడ్డి పాసింగ్ క్లౌడ్ వంటి వారని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు. బీజేపీ తెలంగాణలో ఎప్పుడూ బలంగానే ఉందని... ఉంటుందని, కానీ కొందరు నేతలు అలా వచ్చి వెళ్తుంటారన్నారు. తాను లోక్ సభకు పోటీ చేయాలనుకుంటున్నట్లు స్పష్టం చేశారు.
Go Back to Shorts
dr k laxman
Komatireddy Raj Gopal Reddy
Jithender Reddy
BJP

More Telugu News