Kanakamedala Ravindra Kumar: దేశంలోనే ప్రముఖ అవినీతి రాజకీయనేత సీఎం జగన్ అని జాతీయ మీడియా చెబుతోంది: కనకమేడల

Kanakamedala comments on recent developments
షార్ట్స్‌లో చూడండి
టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ ఇవాళ అవనిగడ్డ వచ్చారు. ఇక్కడి లంకమ్మ తల్లి, మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కనకమేడల మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో స్వచ్ఛమైన పాలన రావాలంటే చంద్రబాబు అధికారంలోకి రావాలని అన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ-జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు పార్టీ శ్రేణులు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. 

దేశంలోకెల్లా ప్రముఖ అవినీతి రాజకీయనేత ఎవరన్నా, అత్యంత ధనిక ముఖ్యమంత్రి ఎవరన్నా... జాతీయ మీడియా సీఎం జగన్ పేరే చెబుతోందని... అందుకే చంద్రబాబుపై బురద చల్లడానికి అక్రమ కేసుతో అరెస్ట్ చేయించారని కనకమేడల ఆరోపించారు. రాష్ట్రంలో సీఎం జగన్ తీసుకువచ్చే ప్రతి స్కీము ఒక స్కాం అని విమర్శించారు. రాష్ట్ర ఆదాయంలో 60 శాతం ఎటు వెళుతుందో చెప్పాలని నిలదీశారు.
Go Back to Shorts
Kanakamedala Ravindra Kumar
Chandrababu
Jagan
TDP
YSRCP
Andhra Pradesh

More Telugu News