కాంగ్రెస్ టిక్కెట్ కేటాయింపులు.. తెలంగాణ నేతలకు ఢిల్లీ నేత కీలక సూచన
- పార్టీ టిక్కెట్ల కేటాయింపుపై సంప్రదింపులు కొనసాగుతాయన్న ఏఐసీసీ కార్యదర్శి అలీఖాన్
- టిక్కెట్ల కేటాయింపు వ్యవహారం ముగియలేదన్న అలీఖాన్
- పార్టీకి లేదా నాయకులకు వ్యతిరేకంగా మాట్లాడవద్దని సూచన
అసెంబ్లీ టిక్కెట్ల కేటాయింపుల విషయంలో ఏమైనా విభేదాలు ఉంటే పార్టీ అంతర్గత వేదికలపై మాట్లాడాలని సూచించారు. కానీ పత్రికా సమావేశాలు, ప్రకటనలు ఇస్తూ పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా మాట్లాడవద్దన్నారు. టిక్కెట్ల కేటాయింపుకు సంబంధించి కొంతమంది నాయకులు పత్రికా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారని, అలా చేయడం సరికాదన్నారు. ఏ నాయకులు కూడా టిక్కెట్ కేటాయింపు విషయంలో బహిరంగంగా మాట్లాడవద్దని, వారికి ఏ సమస్య ఉన్నా అధిష్ఠానం దృష్టికి తీసుకు రావాలన్నారు.