ఆ మెజార్టీకి ఒక్క ఓటు తగ్గినా రాజకీయాల నుంచి తప్పుకుంటా: ఉత్తమ్ కుమార్ రెడ్డి
- 50,000 మెజార్టీతో తాను తప్పకుండా గెలుస్తానని ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా
- కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే వారికి సముచిత స్థానం ఉంటుందని హామీ
- అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని స్పష్టీకరణ
ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మంగళవారం కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే వారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. అందరినీ కలుపుకొని ముందుకు సాగి, పార్టీని అధికారంలోకి తీసుకు వస్తామన్నారు. తెలంగాణలో తాము అధికారంలోకి రాగానే ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు.