క్రికెట్ చూసేందుకు వెళ్లిన సీఎం, డిప్యూటీ సీఎంలపై కుమరస్వామి విమర్శలు

Kumaraswamy fires on Siddaramaiah and DK Shivakumar
  • చిన్నస్వామి స్టేడియంకు వెళ్లిన సిద్దూ, డీకే శివకుమార్
  • రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంటే క్రికెట్ చూసేందుకు వెళ్లారన్న కుమారస్వామి
  • ఆస్ట్రేలియా, పాకిస్థాన్ లలో ఎవరికి సపోర్ట్ చేశారని ప్రశ్న
బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఆస్ట్రేలియా - పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ ను చూడ్డానికి వెళ్లిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ లపై జేడీఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉంటే వాటిని పట్టించుకోకుండా క్రికెట్ మ్యాచ్ ఎంజాయ్ చేసేందుకు వెళ్లారని మండిపడ్డారు. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం క్రికెట్ మ్యాచ్ లు చూస్తోందని దుయ్యబట్టారు.

 ఇంతకీ వాళ్లు ఆస్ట్రేలియాకు సపోర్ట్ చేశారా లేక పాకిస్థాన్ మద్దతు పలికారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. నిధుల కోసం కేంద్రానికి లేఖ రాశామని రాష్ట్ర ప్రభుత్వం చెపుతోందని... వెళ్లి కేంద్రాన్ని కలవాలని హితవు పలికారు. ప్రభుత్వంలో సమన్వయ లోపం కూడా కనిపిస్తోందని చెప్పారు.
Advertisement
Kumaraswamy
JDS
Siddaramaiah
DK Shivakumar
Congress

More Telugu News