Karthika: పెళ్లికి సిద్ధమైన నటి రాధ కూతురు కార్తీక? ప్రూఫ్ ఇదే అంటున్న నెటిజన్లు!

Video of karthika goes viral fuelling speculation of her engagement
షార్ట్స్‌లో చూడండి
ఒకప్పుడు టాలీవుడ్‌ను ఏలిన హీరోయిన్ రాధ కూతురు కార్తీక పెళ్లికి రెడీ అయ్యిందా? నిశ్చితార్థం కూడా జరిగిందా? అంటే అవుననే అంటున్నారు నెటిజన్లు. ఇన్‌స్టాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న కార్తీక వీడియో, ఫొటోలే ఇందుకు కారణం. ఓ వీడియోలో కార్తీక సంప్రదాయిక దుస్తుల్లో మెరిసిపోయింది. మరో ఫొటోలో ఆమె చేతికున్న ఉంగరం స్పష్టంగా కనిపించింది. దీంతో, కార్తీక ఎంగేజ్‌మెంట్ అయిపోయిందని అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు. అయితే, ఈ విషయంలో కార్తీక, ఆమె తల్లి రాధ ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. 

80ల్లో రాధ దక్షిణాది సినీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన విషయం తెలిసిందే. తెలుగులో అగ్రహీరోల సరసన ఆమె పలు హిట్ చిత్రాల్లో నటించింది. ఇక కార్తీక తెలుగులో నాగచైతన్య నటించిన ‘జోష్’ సినిమాలో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోయినప్పటికీ కార్తీక మాత్రం తనకంటూ కొంత గుర్తింపు తెచ్చుకోగలిగింది. ఆ తరువాత కొన్ని తెలుగు చిత్రాల్లోనూ ఆమె నటించింది. జూనియర్ ఎన్టీఆర్ సరసన ‘దమ్ము’లో ఆమె తళుక్కుమన్నా కూడా ఆ తరువాత ఆమెకు ఆశించిన మేర అవకాశాలు రాలేదనే చెప్పాలి. ఈ క్రమంలో సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న కార్తీక వ్యాపారంలో తన ప్రతిభ చాటుకుంటోంది. ప్రస్తుతం ఆమె పెళ్లి వార్త నెట్టింట వైరల్‌గా మారింది. వీడియో కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
 
Go Back to Shorts
Karthika
Radha

More Telugu News