జనసేనతో సమన్వయం కోసం కమిటీ ఏర్పాటు చేసిన టీడీపీ

TDP forms committee for coordination with Janasena party
  • ఇటీవల టీడీపీతో పొత్తు ప్రకటన చేసిన పవన్ కల్యాణ్
  • భాగస్వామ్యం దిశగా ముందడుగు వేసిన టీడీపీ
  • ఐదుగురు సభ్యులతో కమిటీ 
ఇటీవల చంద్రబాబు అరెస్ట్ కాగా, జైలులో చంద్రబాబును పరామర్శించిన అనంతరం జనసేనాని పవన్ కల్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, పొత్తు దిశగా టీడీపీ ముందడుగు వేసింది. జనసేనతో సమన్వయం కోసం నేడు టీడీపీ కమిటీని ఏర్పాటు చేసింది. దీనిపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఓ ప్రకటనలో వెల్లడించారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆదేశాల మేరకు జనసేన పార్టీతో సమన్వయం కోసం కమిటీని నియమించినట్టు వెల్లడించారు. ఇరు పార్టీల సమన్వయం కోసం ఈ కమిటీ పనిచేస్తుందని తెలిపారు.

 కమిటీలోని సభ్యులు...

1. కింజరాపు అచ్చెన్నాయుడు
2. యనమల రామకృష్ణుడు
3. పయ్యావుల కేశవ్
4. పితాని సత్యనారాయణ 
5. తంగిరాల సౌమ్య
Go Back to Shorts
TDP
Committee
Janasena
Coordination
Alliance
Andhra Pradesh

More Telugu News