బొల్లారంలోని అమర్ ల్యాబ్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఒకేసారి పేలిన రెండు రియాక్టర్లు
- ప్రమాద సమయంలో నైట్‌షిఫ్ట్‌లో 15 మంది కార్మికులు
- వారిలో 9 మందికి తీవ్రగాయాలు
- సమీపంలోని ఆసుపత్రికి తరలింపు
- పేలుడు శబ్దానికి ఇళ్ల నుంచి బయటకు వచ్చి పరుగులు తీసిన స్థానికులు
ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదం కారణంగా విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో పరిశ్రమలో గాడాంధకారం నెలకొనడంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. లోపల ఎంతమంది చిక్కుకున్నారనే విషయంలో స్పష్టత లేదు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉంది.