డిసెంబరు 13 నుంచి భద్రాద్రిలో శ్రీవైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు
- డిసెంబరు 23న ఉత్తర ద్వారా దర్శనం
- అదే నెల 13 నుంచి 23 వరకు నిత్యకల్యాణాల నిలిపివేత
- డిసెంబరు 17 నుంచి జనవరి 14 వరకు ధనుర్మాస పూజలు
- జనవరి 15న మకర సంక్రాంతి సందర్భంగా రథోత్సవం
జనవరి 12న కూడారై ఉత్సవం, 14న భోగిని పురస్కరించుకుని శ్రీ గోదాదేవి కల్యాణం, 15న మకర సంక్రాంతి సందర్భంగా రథోత్సవం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో డిసెంబరు 13 నుంచి 23 వరకు నిత్య కల్యాణాలను నిలిపివేయనున్నారు. అలాగే, డిసెంబరు 17 నుంచి జనవరి 14 వరకు ధనుర్మాస పూజలు ఉంటాయని ఈవో రమాదేవి తెలిపారు.