ఇప్పుడు వెల్లుల్లి వంతు.. కిలో రూ.280 కి చేరిన ధర
- సప్లై తగ్గడంతో మార్కెట్లో పెరుగుతున్న వెల్లుల్లి రేటు
- ముంబై హోల్ సేల్ మార్కెట్ లో కిలో రూ.160
- సప్లై దాదాపు 40 శాతం తగ్గిందని చెబుతున్న వ్యాపారులు
నవీ ముంబైలోని మార్కెట్ కు నిత్యం 24 నుంచి 30 వాహనాలలో వచ్చే వెల్లుల్లి స్టాకు ప్రస్తుతం తగ్గిపోయిందని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ (ఏపీఎంసీ) వెల్లడించింది. ఇప్పుడు రోజూ 15 ట్రక్కులకు మించి రావడంలేదని చెప్పింది. సప్లై దాదాపు 40 శాతం పడిపోయిందని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో మార్కెట్లో వెల్లుల్లి ధర పెరుగుతుందని వివరించారు. మే నెల ప్రారంభంలో కిలో వెల్లుల్లి ధర రూ.30 నుంచి రూ.60 వరకు ఉండేదని చెప్పారు.