ఏపీ హైకోర్టు జడ్జిలుగా నలుగురిని సిఫారసు చేసిన కొలీజియం
- ఇటీవల ఏపీ హైకోర్టు నుంచి న్యాయమూర్తుల బదిలీ
- ఏపీ హైకోర్టుకు కొత్త న్యాయమూర్తులు
- సీజేఐ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు
ఈ నలుగురు గతంలో న్యాయవాదులుగా వ్యవహరించారు. వీరిని జడ్జిలుగా నియమించాలని ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్, ఇద్దరు సీనియర్ జడ్జిలు సంప్రదింపులు జరిపి, ఆ మేరకు ప్రతిపాదనలు పంపారు. ఆ నలుగురి అర్హతలు గుర్తించిన సుప్రీంకోర్టు వారిని న్యాయమూర్తులుగా నియమించవచ్చంటూ తాజాగా సిఫారసు చేసింది.