Wamiqa Gabbi: కుర్రకారును హుషారెత్తిస్తున్న వామికా గబ్బీ!

Wamiqa Gabbi Special
షార్ట్స్‌లో చూడండి
వామికా గబ్బి .. ఇప్పుడు ఏ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై చూసినా ఆమె సందడి కనిపిస్తూనే ఉంటుంది. వెబ్ సిరీస్ లను ఫాలో అయ్యేవారికి ఆమెను గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన పని లేదు. ఆమె కోసం ఆ వెబ్ సిరీస్ లను ఫాలో అయ్యేవారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఆమెలో ప్రత్యేకమైన ఆకర్షణ ఆమె కళ్లు .. అవి చెప్పే సంగతులు .. కబుర్లు అన్నీ ఇన్నీ కావు.ఆ కళ్లు చేసే విన్యాసాలను చూడటం కోసమే కుర్రాళ్లంతా ఉత్సాహాన్ని చూపుతుంటారు. యూత్ తన నుంచి ఆశిస్తున్నవి అందించినప్పుడే తాను ఎక్కువ కాలం నిలబడతాననే విషయం వామికా గబ్బీకి   తెలుసు. అందువల్లనే ఆమె ఆ తరహా పాత్రలను ఎంచుకుంటూ వెళుతోంది. తెలుగులో సుధీర్ బాబు జోడీగా 'భలేమంచి రోజు' సినిమా చేసిందిగానీ, అప్పటికి ఆమె అంత పాప్యులర్ కాదు గనుక జనాలకి గుర్తులేదు. ఈ పంజాబీ బ్యూటీ ఇప్పుడు వరుస వెబ్ సిరీస్ లతో ఫుల్ బిజీ. 'జూబ్లీ' .. 'గ్రహణ్' సిరీస్ లు ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఇటీవల వచ్చిన 'చార్లీ చోప్రా' .. 'ఖూఫియా' ఆమె క్రేజ్ ను మరింత పెంచాయి. 'ఖూఫియా'లో ఆమె గ్లామర్ డోస్ పెంచటం .. హాట్ సీన్స్ లో కనిపించడంతో కుర్రాళ్లకి కుదురులేకుండా పోయింది. ఎలాంటి పాత్రనైనా చాలా ఈజ్ తో చేసే వామికా, మరింత వేగంగా తన కెరియర్ గ్రాఫ్ ను పరిగెత్తించగలదనడంలో ఎలాంటి సందేహం లేదు.
Go Back to Shorts
Wamiqa Gabbi
Actress
Bollywood

More Telugu News