కేటీఆర్ భావోద్వేగం.. కుమారుడిని మిస్సవుతున్నానంటూ నెట్టింట పోస్ట్
- అమెరికాలో చదువుకుంటున్న కేటీఆర్ తనయుడు హిమాన్షు
- ఫొటోను నెట్టింట షేర్ చేస్తూ మంత్రి భావోద్వేగం
- కేటీఆర్ పోస్ట్ వైరల్, భారీఎత్తున అభిమానుల స్పందన
- ఇప్పుడు బెంగగా ఉన్నా తరువాత కుమారుడి విజయాలకు గర్విస్తారంటూ నెటిజన్ల కామెంట్
ఉన్నత చదువులకోసం హిమాన్షు అమెరికాకు వెళ్లడం జరిగింది. గచ్చిబౌలిలోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఇంటర్మీడియట్ అనంతరం అతను ఈ ఆగస్టులో అమెరికాకు వెళ్లారు. ఆయన వెంట కేటీఆర్-శైలిమ దంపతులు, చెల్లి అలేఖ్య కూడా వెళ్లారు. ఈ క్రమంలో అడ్మిషన్ ప్రక్రియ పూర్తయ్యాక వారం రోజులకు కేటీఆర్ తన కుటుంబంతో కలిసి ఇండియాకు తిరిగొచ్చారు.
చదువు పూర్తి చేసుకున్న విద్యార్థుల కోసం స్కూల్లో జరిగిన గ్రాడ్యూయేషన్ డే వేడుకలకు తాత, నాయనమ్మ కేసీఆర్, శోభ దంపతులు తల్లిదండ్రులు కేటీఆర్, శైలిమ, చెల్లి అలేఖ్య కూడా హాజరయ్యారు. సామాజిక సేవలో ముందుండే హిమాన్షుకు అప్పట్లో సీఏఎస్ ఎక్సలెన్స్ అవార్డు కూడా లభించింది.