తిరుమల వెంకన్నకు తలనీలాలు సమర్పించిన కేసీఆర్ భార్య శోభ
- నిన్ననే తిరుమలకు చేరుకున్న కేసీఆర్ భార్య శోభ
- తెల్లవారుజామున సుప్రభాత సేవలో పాల్గొన్న కేసీఆర్ సతీమణి
- శోభను ఆశీర్వదించి తీర్థప్రసాదాలను అందించిన అర్చకులు
నిన్ననే తిరుమలకు చేరుకున్న ఆమె... ఈ తెల్లవారుజామున సుప్రభాత సేవలో పాల్గొన్నారు. అనంతరం శ్రీవారి అర్చన సేవలో పాల్గొని స్వామివారి ఆశీస్సులను తీసుకున్నారు. శోభకు అర్చకులు, టీటీడీ అధికారులు స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు. ఆమెను అర్చకులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలను అందించారు. వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పక్కనే ఉండి ఆమె కు స్వామివారి దర్శనం చేయించారు.