తెలంగాణకు భారీగా నగదు తీసుకెళ్తున్నారా? అయితే ఆధారాలు చూపించాల్సిందే!
- రూ.50వేల కంటే ఎక్కువ మొత్తం తీసుకెళ్లేవారు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే
- అధికారుల తనిఖీల్లో సరైన పత్రాలు చూపించక తప్పదు
- ఒకవేళ పట్టుబడితే ఎన్నికలు ముగిశాక ఆధారాలు చూపిస్తేనే తిరిగి ఇచ్చే అవకాశాలు
తెలంగాణలో 148 చెక్ పోస్టులు పెట్టినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చేవారు, తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారు పెద్ద ఎత్తున నగదు వంటివి తీసుకు వెళ్తే తగిన ఆధారాలు, ధ్రువపత్రాలను వెంట ఉంచుకోవాలి. రూ.50 వేలు అంతకంటే ఎక్కువ నగదు తరలిస్తే కచ్చితంగా ఆధారాలు ఉంచుకోవాలి.
ఆసుపత్రికి వెళ్లే అవసరమైతే రోగికి సంబంధించిన రిపోర్టులు, హాస్పిటల్ రిసీట్, ఇతర డాక్యుమెంట్స్ సిద్ధంగా ఉంచుకోవాలి. వస్తువులు, ధాన్యం విక్రయం సొమ్ము, భూమికి సంబంధించిన నగదు వంటివి ఉంటే ఇందుకు సంబంధించి బిల్లులు దగ్గర ఉంచుకోవాలి. భారీగా నగదు దొరికితే జీఎస్టీ, ఐటీ అధికారులు కూడా రంగంలోకి దిగుతారు.