Mona Singh: 'నెట్ ఫ్లిక్స్' ఫ్లాట్ ఫామ్ పైకి 'కాలాపాని' సిరీస్!

Kaalapani Web Series Update
షార్ట్స్‌లో చూడండి
'కాలాపాని' సినిమా చూసిన తరువాత, అక్కడి జైలు .. ఒకప్పుడు అక్కడి ఖైదీలను శిక్షించే తీరు గురించిన ఒక అవగాహన చాలామందికి వచ్చింది. మోహన్ లాల్ - ప్రభు కథానాయకులుగా నటించిన ఈ సినిమాకి ప్రియదర్శన్ దర్శకత్వం వహించాడు. ఆయన కెరియర్లో చెప్పుకోదగిన సినిమాలలో ఇది ఒకటిగా నిలిచింది. 

ఇప్పుడు అదే టైటిల్ తో నెట్ ఫ్లిక్స్ ఒక వెబ్ సిరీస్ ను అందించనుంది. అండమాన్ - నికోబార్ ప్రాంతంలోని సెల్యులార్ జైలు చుట్టూ ఈ కథ తిరగనుంది. సమీర్ సక్సేనా దర్శక నిర్మాతగా వ్యవహరించిన ఈ సిరీస్ ఈ నెల 18వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. 

ఈ సిరీస్ కి సంబంధించిన ట్రైలర్ అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సముద్రం .. దట్టమైన అడవులు .. భయంకరమైన ఆటవికుల నేపథ్యంలో ఈ కథ  ఉత్కంఠను పెంచుతోంది. మోనా సింగ్ .. అశుతోష్ గోవారికర్ .. అమీ వాఘ్ .. సుకాంత్ గోయెల్ .. వికాస్ కుమార్ .. ఆరుషి శర్మ .. ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. మరి ఈ సిరీస్ ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి. 

Go Back to Shorts
Mona Singh
Ashutosh Govarikar
Amey Wagh
Sukanth Goel

More Telugu News