ఐఐటీ కాన్పూరులో చితక్కొట్టేసుకున్న విద్యార్థులు.. కుర్చీలతో కుమ్ములాట.. ముష్టిఘాతాలతో వీరంగం.. వీడియో ఇదిగో!
- రెండు కబడ్డీ జట్ల మధ్య గొడవ
- తెలియని కారణం
- రెండు జట్లపైనా అనర్హత వేటు
ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకుంటూ, ఒకరిపై ఒకరు ముష్టిఘాతాలు కురిపించుకుంటూ బీభత్సం సృష్టించడం వీడియోలో కనిపించింది. పోట్లాటకు దిగిన రెండు జట్లు కాన్పూరు వెలుపలివి కావడం గమనార్హం. ఈ గొడవ తర్వాత రెండు జట్లపై అనర్హత వేటు వేశారు. ఈ ఘటనపై ఐఐటీ కాన్పూరు అధికారికంగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.