కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సీఎం జగన్ దాదాపు గంటపాటు భేటీ

YS Jagan meets union minister amit shah
  • ఏపీకి రావాల్సిన నిధులు, బకాయిలపై చర్చించిన నేతలు
  • ఇతర అంశాలపై కూడా చర్చించినట్లుగా సమాచారం 
  • వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సమావేశం కోసం ఢిల్లీకి వచ్చిన జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం సాయంత్రం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఇరువురు నేతలు దాదాపు గంటపాటు సమావేశమైనట్లుగా తెలుస్తోంది. ఏపీకి రావాల్సిన నిధులు, బకాయిలతో పాటు వివిధ అంశాలపై వారు చర్చించినట్లుగా తెలుస్తోంది. అంతకుముందు, కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో జరిగిన వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సమావేశానికి కూడా సీఎం జగన్ హాజరయ్యారు. జగన్ నిన్న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు పలువురు కేంద్రమంత్రులను కలిశారు. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ముగించుకుని రేపు రాష్ట్రానికి తిరిగి రానున్నారు.
Advertisement
YS Jagan
Amit Shah
Andhra Pradesh
BJP

More Telugu News