30 కిలోల టమాటాల ధర ఒక్క కప్పు టీకి సమానం
- కర్నూలులో భారీగా పడిపోయిన టమాటా ధర
- కిలో 30 పైసలు పలకడంతో విలవిలలాడుతున్న రైతు
- మార్కెట్ యార్డ్ అధికారులు పట్టించుకోవట్లేదంటూ ఆగ్రహం
రిటైల్ మార్కెట్లో టమాటా కిలో రూ. 20 కి అమ్ముతుండగా.. హోల్ సేల్ మార్కెట్లో మాత్రం వ్యాపారులు కనీస ధర కూడా పెట్టడంలేదని రైతులు ఆరోపిస్తున్నారు. వారం రోజుల క్రితం టమాటా రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని, ప్రభుత్వమే గిట్టుబాటు ధరకు టమాటా పంటను కొనుగోలు చేస్తుందని అధికారులు చెప్పారు. అయితే, ఈ హామీ కేవలం నోటి మాటకే పరిమితమైందని రైతులు విమర్శిస్తున్నారు. కిలో 30 పైసలకు మించి ధర రాకున్నా మార్కెట్ యార్డ్ అధికారులు పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.