కేబినెట్ భేటీలో కృష్ణా జలాల పంపిణీ వివాదంపై కీలక నిర్ణయం: కిషన్ రెడ్డి
- బుధవారం ప్రధాని నివాసంలో కేంద్ర కేబినెట్ అత్యవసర భేటీ
- కృష్ణా జలాల పంపిణీ వివాదం పరిష్కార బాధ్యతలను రెండవ కృష్ణా ట్రైబ్యునల్‌కు అప్పగిస్తూ కేంద్రం నిర్ణయం
- కేబినెట్ భేటీ వివరాలను వెల్లడించిన మంత్రి కిషన్ రెడ్డి
నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ నిర్ణయించినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున తాను ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. పసుపు ఉత్పత్తితో దేశంలోనే మహారాష్ట్ర తొలిస్థానంలో ఉండగా రెండో స్థానం తెలంగాణాదేనని తెలిపారు. పసుపు ఉత్పత్తులు పెంచే బాధ్యత, పసుపు వినియోగంపై నిర్ణయాలు బోర్డు తీసుకుంటుందని వివరించారు. సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి సమ్మక్క, సారక్క పేరు ఖరారు కావడంపై కూడా మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.