కేసీఆర్‌పై మోదీ వ్యాఖ్యల దుమారం.. స్పందించిన రేవంత్ రెడ్డి
- ఇప్పటికైనా ముసుగు తొలగి, నిజం బయటకు వచ్చిందన్న టీపీసీసీ చీఫ్
- మోదీ నోట చీకటి మిత్రుడి మాట బయటకు వచ్చిందని వ్యాఖ్య
- మోదీ-కేసీఆర్‌లది చీకటి బంధమని విమర్శ
నిజామాబాద్ గడ్డపై మరోసారి ఈ బంధం బయటపడిందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ చీకటి మిత్రులని, ఢిల్లీలో దోస్తీ చేస్తూనే గల్లీలో కుస్తీ పడుతున్నారన్నారు. ఇన్నాళ్లు తాము చెప్పిందే నిజమైందన్నారు. కేసీఆర్ ఎన్డీయేలో చేరాలని ప్రయత్నం చేసింది నిజమే... అలాగే వారిద్దరు మిత్రులేనన్నది అంతకంటే నిజమన్నారు. నిప్పులాంటి నిజం ఎప్పటికైనా బయటపడక తప్పదన్నారు.