Kishan Reddy: ప్రధాని మోదీ కార్యక్రమాలకు ఈ సీఎం ఎందుకు రావడంలేదు?: కిషన్ రెడ్డి

Kishan Reddy asks why does CM KCR not attend Prime Minister programs
షార్ట్స్‌లో చూడండి
ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటిస్తున్నప్పుడు, సీఎం కేసీఆర్ ఆయన పర్యటనలకు దూరంగా ఉంటున్నారు. ఇవాళ ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి  పనులకు ప్రారంభోత్సవం చేయగా, ఆ కార్యక్రమానికి కూడా సీఎం కేసీఆర్ హాజరు కాలేదు. దీనిపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడ్డారు. 

దేశంలో ఎక్కడైనా ఇలాంటి ముఖ్యమంత్రి ఉన్నాడా? ప్రధాని వస్తే, ఆయన కార్యక్రమాలకు హాజరయ్యేంత తీరిక ఈ సీఎంకు లేదా? అని ప్రశ్నించారు. ఎంతసేపూ ఓటు బ్యాంకు రాజకీయాలేనా? అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. 

వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు ప్రధాని వస్తే, సీఎం హాజరు కాకపోవడం అభివృద్ధి పట్ల ఈ ప్రభుత్వ చిత్తశుద్ధి ఏపాటిదో తెలియజేస్తుందని కిషన్ రెడ్డి విమర్శించారు. మహబూబ్ నగర్ సభలో ప్రసంగిస్తూ కిషన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
Go Back to Shorts
Kishan Reddy
Narendra Modi
Prime Minister
KCR
BJP
BRS
Telangana

More Telugu News