నాకు కేటీఆర్ సర్టిఫికెట్ అవసరంలేదు: కిషన్ రెడ్డి
- తనకు తెలంగాణ ప్రజల సర్టిఫికెట్ చాలని వ్యాఖ్య
- అక్టోబర్ మొదటి వారంలో ప్రధాని మోదీ తెలంగాణకు వస్తున్నారని వెల్లడి
- మోదీ తెలంగాణ పర్యటన గురించి ప్రశ్నించేందుకు కేసీఆర్ ఎవరని ప్రశ్న
పాలమూరు సభలో పలు అభివృద్ధి పనులకు, ప్రారంభోత్సవాలు, భూమిపూజ కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. ఇందూరులో 800 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన రూ.6వేల కోట్ల విలువైన ఎన్టీపీసీ పవర్ ప్లాంటును మోదీ వర్చువల్ గా ప్రారంభిస్తారన్నారు. హైదరాబాద్ నుంచి మొదలు అదిలాబాద్ వరకు బీజేపీ బలోపేతమైందన్నారు. ఖమ్మం జిల్లాలో కూడా పెద్ద ఎత్తున మార్పులు వస్తున్నాయని, గిరిజనులతో పాటు స్థానిక ప్రజలు బీజేపీని ఆదరించి మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు. బీజేపీపై విమర్శలు చేసే నైతిక హక్కు కేటీఆర్, బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు. మోదీ తెలంగాణ పర్యటన గురించి ప్రశ్నించేందుకు కేసీఆర్ ఎవరు? అని ధ్వజమెత్తారు. పసుపు బోర్డు ఏర్పాటుపై చర్చించి నిర్ణయిస్తామన్నారు.