Nara Lokesh: అసలు వేయని రింగ్ రోడ్డు కేసులో 420 సీఎం నన్ను ఏ14గా చేర్పించాడు: నారా లోకేశ్

420 CM Jagan made me A14 in inner ring road case says Nara Lokesh
షార్ట్స్‌లో చూడండి
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ యువనేత నారా లోకేశ్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యువగళం పేరు వింటేనే సైకో జగన్ గజగజలాడుతున్నారని లోకేశ్ ఎద్దేవా చేశారు. తన పాదయాత్ర ప్రారంభం కాకూడదని జీవో 1 తెచ్చినా... యువగళం ఆగలేదని, జనగళమై గర్జించిందని అన్నారు. ఎక్కడికక్కడ అడ్డుకున్నా జనజైత్రయాత్రగా ముందుకు సాగిందని చెప్పారు. మళ్లీ యువగళం ఆరంభిస్తామనే సరికి... తన శాఖకు సంబంధం లేని, అసలు వేయని రింగ్ రోడ్డు కేసులో తనను ఈ 420 సీఎం ఏ14గా చేర్పించారని మండిపడ్డారు. రిపేర్ల పేరుతో రాజమండ్రి బ్రిడ్జిని మూసేయించారని విమర్శించారు. నువ్వు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, అక్రమ అరెస్టులు చేసినా యువగళం ఆగదని చెప్పారు. ఎన్ని అడ్డంకులు కల్పించినా జన చైతన్యమే యువగళాన్ని వినిపిస్తుందని, ఇచ్ఛాపురం వరకు నడిపిస్తుందని అన్నారు. 

Go Back to Shorts
Nara Lokesh
Telugudesam
Jagan
YSRCP

More Telugu News