గవర్నర్ తమిళిసై తీరు బాధాకరం: ఎమ్మెల్సీ కవిత
- సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణ
- నామినేటెడ్ ఎమ్మెల్సీల పేర్లను తిరస్కరించడంపై మండిపాటు
- బీజేపీ బీసీ వ్యతిరేక పార్టీ అంటూ విమర్శించిన ఎమ్మెల్సీ
నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణల పేర్లను తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈమేరకు కేబినెట్ తీర్మానం చేసి గవర్నర్ ఆమోదానికి పంపించింది. అయితే, సర్వీస్ కేటగిరీ కింద రాజకీయ నాయకుల పేర్లను ప్రతిపాదించారంటూ గవర్నర్ తమిళిసై తిరస్కరించారు. వారిద్దరూ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నారని, అలాంటి వారిని సేవారంగం కోటా కింద ప్రతిపాదించడం సరికాదని అన్నారు. తగిన అర్హతలు లేని కారణంగా కేబినెట్ ప్రతిపాదనలను తిరస్కరిస్తున్నట్లు చెప్పారు.