అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతాం..: నారా లోకేశ్
- జనం కోసం ఎన్ని అవమానాలైనా భరిస్తామన్న టీడీపీ నేత
- ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని వెల్లడి
- వీధుల్లో పోరాటం ఆపబోమని స్పష్టతనిచ్చిన లోకేశ్
ప్రజా సమస్యలపైన ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశాన్ని వదులుకోవద్దని వివరించారు. చంద్రబాబు అక్రమ అరెస్టు పైనా శాసన సభలో పార్టీ గళం వినిపించాలని నిర్ణయించారు. అదే సమయంలో బయట కూడా ఆందోళనలు నిర్వహించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలను ఆపొద్దని లోకేశ్ చెప్పారు. అసెంబ్లీ లోపలా బయట కూడా నిరసనలు తెలియజేయాలని సూచించారు. మరోవైపు, ఈ అసెంబ్లీ సమావేశాలలో వైసీపీ సర్కారు పలు బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ సహా వివిధ బిల్లులపై చర్చ జరగనుంది.