మెక్సికోలో ఏలియన్స్ బాడీలపై నాసా ఏమన్నదంటే..!
- పరిశోధన జరిపాకే అవేంటనేది చెప్పగలమని వెల్లడి
- యూఎఫ్ఓలపై ప్రత్యేక రిపోర్టు విడుదల చేసిన నాసా
- ఈ రీసెర్చ్ కోసం ప్రత్యేకంగా డైరెక్టర్ నియామకం
గుర్తుతెలియని ఎగిరే వస్తువు (అన్ ఐడెంటిఫైడ్ ఫ్లైయింగ్ ఆబ్జెక్ట్) గా వ్యవహరించే అన్ ఐడెంటిఫైడ్ అనోమోలస్ ఫెనామెనన్ (యూఏ పీ) లపై నాసా తాజాగా ఓ కొత్త రిపోర్టును విడుదల చేసింది. ఈ విషయంలో సాధారణ ప్రజలకు అవగాహన పెంచేందుకు ప్రయత్నించాలన్న విజ్ఞప్తుల నేపథ్యంలో యూఏపీ పరిశోధన కోసం ప్రత్యేకంగా కమిటీ వేసినట్లు ప్రకటించింది. ప్రిన్స్ టన్ యూనివర్సిటీ ఆస్ట్రోఫిజిక్స్ డిపార్ట్ మెంట్ మాజీ హెడ్ డేవిడ్ స్పెర్గల్ ను ఈ కమిటీకి డైరెక్టర్ గా నియమించింది. నాసా తాజా రిపోర్టు విశేషాలను డేవిడ్ స్పెర్గల్ గురువారం మీడియాతో పంచుకున్నారు. ఈ సందర్భంగా మెక్సికోలో గ్రహాంతరవాసుల అవశేషాలపై మీడియా ప్రశ్నించగా.. పరీక్షలు జరిపాకే అవేంటనేది చెప్పగలమని అన్నారు. అయితే, వాటికి సంబంధించిన ఎలాంటి నమూనాలు తమకు అందుబాటులో లేవని డేవిడ్ వివరించారు.