స్క్రబ్ టైపస్‌తో అనంతపురం జిల్లా యువకుడి మృతి.. జిల్లాలో ఇదే తొలికేసు
- జ్వరంతో బాధపడుతూ పోతుకుంట యువకుడు మధు మృతి
- స్క్రబ్ టైపస్ వ్యాధితో మృతి చెందినట్టు నిర్ధారణ
- కీటకం కుట్టడం ద్వారానే మనుషులకు ఈ వ్యాధి వస్తుందన్న అధికారులు
మధు స్క్రబ్ టైపస్ వ్యాధితోనే మృతి చెందినట్టు ప్రచారం జరగడంతో అప్రమత్తమైన జిల్లా వైద్యాధికారులు వెంటనే మధు స్వగ్రామమైన పోతుకుంటకు ప్రత్యేక బృందాన్ని పంపారు. ఆసుపత్రి రికార్డుల్లో మధు స్క్రబ్ టైపస్‌తోనే మృతి చెందినట్టు ఉండడాన్ని ఈ బృందం గుర్తించి ఉన్నతాధికారులకు నివేదిక పంపింది. ఇది ఓ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అని, కీటకం కుట్టడం ద్వారా మనిషికి సోకుతుందని తెలిపారు. ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు గ్రామంలో కీటక నివారిణి స్ప్రే చేశారు. మధు కుటుంబ సభ్యులను పరిశీలనలో ఉంచారు.