ఎంపీలకు విప్ జారీ చేసిన బీజేపీ, కాంగ్రెస్.. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలపై ఉత్కంఠ
- ఈ నెల 18నుంచి 22 వరకు సమావేశాలు
- సమావేశాల ఎజెండాను ప్రకటించిన ఉభయ సభలు
- ఐదు కీలక బిల్లులపై జరగనున్న చర్చ
ఈ సమావేశాల్లో కీలకమైన ఐదు బిల్లులు ఉభయ సభల ముందుకు రాబోతున్నాయి. వీటిలో ది అడ్వకేట్స్ సవరణ బిల్లు-2003, ద ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లు-2023, ఎన్నికల కమిషనర్ బిల్లు ఉన్నాయి. ఎజెండాలో వెల్లడించని అంశాలను కూడా బీజేపీ ప్రవేశపెట్టే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో 18వ తేదీ ఉదయం 11 గంటల నుంచి 22వ తేదీ వరకూ ఎంపీలంతా తప్పని సరిగా హాజరై, పార్టీ వైఖరికి మద్దతుగా నిలవాలని కాంగ్రెస్ పార్టీ తమ విప్‌లో స్పష్టం చేసింది.