వాల్‌బాకీయా దోమలతో డెంగీకి చెక్
- డెంగీకి చెక్ పెట్టేందుకు హోండూరస్‌లో శాస్త్రవేత్తల ప్రయత్నం
- వాల్‌బాకీయా బ్యాక్టీరియా ఉన్న దోమలను పెద్ద సంఖ్యలో స్థానికంగా విడుదల
- ఈ బ్యాక్టీరియాతో దోమల్లో వైరస్ పెరుగుదలకు అడ్డుకట్ట
- ఇప్పటికే అనేక దేశాల్లో అమలవుతున్న వ్యూహం
దశాబ్దకాలంగా అనేక దేశాల్లో అమలవుతున్న ఈ వ్యూహాన్ని హోండురాస్ అధికారులు తాజాగా అనుసరించడం ప్రారంభించారు. రాజధాని తెగెసిఅల్పాలో వోల్‌బాకియా దోమలను పెద్ద సంఖ్యలో విడుదల చేస్తున్నారు. వచ్చే ఆరు నెలల్లో మొత్తం 90 లక్షల వోల్‌బాకియా దోమల్ని విడిచిపెడతామని వారు చెప్పారు. అయితే, ఈ వ్యూహాం అమలుకు ఖర్చు భారీగా ఉంటుందని కూడా చెబుతున్నారు.